- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగన్ రాముడో, రావణాసురుడో ప్రజలే తేల్చాలి: జేసీ
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్.. రాముడో, రావణాసురుడో ప్రజలే తేల్చాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ లాంటి సీఎం ఏపీకి మళ్లీ దొరకడని అన్నారు. ఆయన పాలనకు నూటికి 110 మార్కులు వేస్తానని ఎద్దేవా చేశారు. జగన్ నిరంకుశ ధోరణి, పట్టుదల పరాకాష్ఠకు చేరాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పే సాక్ష్యమని ఆయన తెలిపారు.
తానుబట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే నైజాన్ని జగన్ వదులుకోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే వ్యతిరేక తీర్పులే వస్తాయనే విషయం ప్రభుత్వానికి తెలిసినా మొండిగా ముందుకు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని చెప్పారు. తిరుమల వెంకన్న ఆస్తులు అమ్మాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో ఓట్ల కోసం జగన్ ఇప్పటి నుంచే దృష్టి సారించాలని… ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఓట్లు పడవనే విషయం 2019 ఎన్నికల్లోనే తేలిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.