మన్యంలో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

by Sridhar Babu |   ( Updated:2021-08-06 03:03:39.0  )
jayashamkar
X

దిశ, గుండాల : గుండాల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఎంపీడీవో ఓహోలీ హజరత్ మాట్లాడుతూ.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సమైక్యవాదుల చేతిలో నలిగిపోతున్న తెలంగాణను కాపాడుకోవాలనే దృక్పథంతో జయశంకర్ సిద్ధాంతం రూపొందించారని అన్నారు.

మలిదశ ఉద్యమానికి పునాది వేసిన జయశంకర్ సార్ స్పూర్తి గొప్పదని కొనియాడారు. జయశంకర్ జయంతి నేపథ్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్‌కే సంధాని, ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, కార్యదర్శి పట్టం సురేష్, వై. వెంకన్న, అనిల్, నాగరాజు, ఆజాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story