- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1971 యుద్ధ విజయం.. ఆ గుర్తుతో జావా స్పెషల్ ఎడిషన్ బైకులు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జావా భారత మార్కెట్లోకి రెండు సరికొత్త బైకులను విడుదల చేసింది. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీటిని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఖాకీ, మిడ్‌నైట్ గ్రే కలర్లలో స్పెషల్ ఎడిషన్ బైకులను ప్రవేశపెట్టింది. జావా స్పెషల్ ఎడిషన్ బైకుల ధరను రూ. 1.93 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే జావా కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మోడళ్లు జావా 42 ధరతో పోలిస్తే రూ. 15 వేలు, స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే రూ. 6 వేలు అధిక ధరలు ఈ కొత్త ఎడిషన్ బైకులు లభిస్తాయి.
ఆన్‌లైన్ ద్వారా ఈ బైకుల కోసం బుకింగ్ చేసుకోవచ్చని, ఇవి 293సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ వస్తుందని కంపెనీ వివరించింది. ఈ బైకుల్ విశేషాల గురించి కంపెనీ.. భారత సైన్యం చరిత్రలో, దేశీయ మోటార్‌సైకిల్ పరిశ్రమలో మొదటిసారిగా ఖాకీ కలర్ బైకు తయారీలో ఆర్మీ చిహ్నాన్ని బైకుపై ఉపయోగించేందుకు అనుమతి తీసుకున్నామని తెలిపింది. అలాగే, కొత్త జావా మిడ్‌నైట్ గ్రే ఎడిషన్ మోడల్‌లో కూడా ఇవే ఫీచర్లు ఉంటాయి. సాంకేతికంగా రెండు బైకులు ఒకేవిధంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.