ఆరుగురి బౌలింగ్ వేసిన బుమ్రా

by Shyam |
ఆరుగురి బౌలింగ్ వేసిన బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL) 2020 కోసం యూఏఈ చేరుకున్న జట్లు అన్నీ ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కాగా, ముంబై ఇండియన్స్ (MI)జట్టు కూడా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సమయంలో ఆ జట్టు బౌలర్ జస్ప్రీత్ బూమ్రా ఆరుగురు అంతర్జాతీయ బౌలర్లను అనుకరిస్తూ బౌలింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. ఆ వీడియోను ట్విట్టర్‌లో పెట్టిన ముంబై ఇండియన్స్ జట్టు బూమ్రా వేసిన ఆరు బంతుల స్టైల్స్ ఎవరెవరివో గుర్తు పట్టమని కోరింది. మునాఫ్ పటేల్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్, కేదార్ జాదవ్, శ్రేయాస్ గోపాల్ మరియు అనిల్ కుంబ్లేలా జస్ప్రీత్‌ బుమ్రా ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్ చేశాడు. అందరిలోకెల్ల అనిల్ కుంబ్లే బౌలింగ్‌ను బుమ్రా అచ్చం దించేశాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది.

https://twitter.com/mipaltan/status/1302963340436676609

Advertisement

Next Story