నాలుగు దశాబ్దాలుగా.. కూపన్లతో ఫ్రీ లైఫ్!

by Shyam |
నాలుగు దశాబ్దాలుగా.. కూపన్లతో ఫ్రీ లైఫ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా మాల్‌ లేదా షాపింగ్ సెంటర్‌కు వెళితే ఏవో కూపన్స్ ఇస్తుంటారు. అందులో మన పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్‌ను రాసి ఓ డబ్బాలో వేస్తే.. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి మంచి గిఫ్ట్ రావడం తెలిసిందే. అలాగే, ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్స్ యాప్స్‌ ద్వారా పేమెంట్స్ చేసినా, ఫుడ్ ఆర్డర్ చేసినా కూపన్స్ వస్తుంటాయి. ఆ కోడ్‌ ఉపయోగించి సదరు బ్రాండ్ ప్రొడక్ట్ కొంటే మనకు అందులో డిస్కౌంట్ లభిస్తుంది. ఇలా ఉచితంగా ఇచ్చే కూపన్స్‌తో చాలా మంది లబ్ది పొందుతుంటారు. అయితే ఓ వ్యక్తి.. కేవలం కూపన్స్‌ ఆధారంగానే నాలుగు దశాబ్దాల నుంచి జీవనం సాగిస్తున్నాడంటే నమ్ముతారా? 36 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా తన జేబులోంచి వెచ్చించలేదంటే బిలీవ్ చేస్తారా? ‘ప్యాడ్‌మ్యాన్, స్పైడర్‌మాన్‌’లే కాదు.. ఇప్పుడు ఈ కూపన్ మ్యాన్ గురించి కూడా తెలుసుకోండి.

డబ్బులేవీ ఖర్చు పెట్టకుండా, లైఫ్‌ను కేవలం కూపన్లతోనే చాలా కంఫర్టబుల్‌గా లీడ్ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు జపాన్‌కు చెందిన 71 ఏళ్ల హిరోటో కిరితాని. అందుకే ఆయన జపాన్‌లో ఓ మినీ సెలబ్రిటీగా మారిపోయాడు. ఎన్నో టీవీ షోలు, ఈవెంట్స్‌‌కు ఆయను గెస్ట్‌గా పిలుస్తుంటారు. ఇప్పటికే ఎన్నో మ్యాగజైన్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కేవలం యుటిలిటీస్, రెంట్‌కు మాత్రమే ఆయన డబ్బులను వెచ్చిస్తాడు. అలా అని ఆయన చాలా పొదుపరి అని అనుకునేరు.. అదేం కాదు. అతడు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కంపెనీల మీద ఇన్వెస్ట్ చేశాడు. ఆ కంపెనీలు అందించే కూపన్స్‌‌ను ఉపయోగించి అతడు సంతోషంగా జీవిస్తున్నాడు.

జపనీస్ చెస్ (షొగి)‌లో కిరిటానీ ఆరితేరాడు. ఆయనో ప్రొఫెషనల్ షొగి ప్లేయర్. దాంతో అతడిని ‘టోక్యో సెక్యూరిటీస్ క్యోవకాయ్’ అనే ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ తమ స్టాఫ్‌కు షొగి గురించి వివరించమని ఆహ్వానించింది. ఆ క్రమంలోనే స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి తెలుసుకున్న కిరితాని.. అలా 1984లో తను ఫస్ట్ స్టాక్‌ను ఇన్వెస్ట్ చేశాడు. అందులో మంచి లాభాలు రావడంతో, ఇక అదే పనిని కొనసాగించాడు. అయితే 1989లో ద నిక్కెయ్ స్టాక్ వాల్యూ క్రాష్ అయిపోయింది. దాంతో అతడు 100 మిలియన్ యెన్స్ కోల్పోయాడు. కిరితానీకి అది అతిపెద్ద లాస్. కానీ ఆ లాస్ అతడికి ఇన్వెస్టర్ బెన్‌ఫిట్స్ వర్త్ తెలిసేలా చేసింది. సాధారణంగా ఏదైనా ఒక సంస్థ లాభం.. నిర్దిష్ట పరిమితికి మించి ఉన్నంత వరకు తమ వాటాదారులకు కూపన్లు, వోచర్ల రూపంలో ప్రయోజనాలు అందిస్తూ ఉంటుంది. 1989నాటి జపనీస్ స్టాక్ ఎక్స్‌చేంజ్ క్రాష్ వల్ల తన జేబులోంచి డబ్బులు ఖర్చు చేయకుండా ఆహారం, దుస్తులు కొనడానికి అవసరమయ్యే కూపన్లను ఇన్వెస్టర్స్ బెన్‌ఫిట్స్ రూపంలో పొందాడు. ఆ తర్వాత 2011లో జపాన్‌లో సంభవించిన భూకంపం వల్ల మరోసారి స్టాక్ ఎక్స్‌చేంజ్ క్రాష్ అయ్యింది. దాంతో ఈ సారి కిరితానికి పెద్ద మొత్తంలో కూపన్లు, వోచర్లు వచ్చాయి. వాటితో తన జీవితకాలం మొత్తం కూడా బతికేయవచ్చని కిరితాని తెలిపాడు. దాంతో కిరితాని జపాన్‌లో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు.

కిరితానికి వచ్చిన కూపన్లతో ఆయనకు అన్ని ఉచితంగానే లభిస్తున్నాయి. ఆయన దగ్గరున్న ఓ కూపన్ ఉపయోగించి.. ఏడాదిలో 300 సార్లు సినిమాకు వెళ్లొచ్చు. ఇంకో కూపన్‌తో ఆయన ఉచితంగా జిమ్ చేయొచ్చు. వెజిటేబుల్స్ కూడా ఫ్రీగా కొనుక్కోవచ్చు. మరో కూపన్‌తో ఫుడ్ ప్రొడక్ట్స్ లభిస్తాయి. గ్రాసరీస్ అన్నీ కూడా కూపన్స్ ఉపయోగించి తెచ్చుకోవచ్చు. ఆయనకు మొత్తంగా 1000 జపనీస్ కంపెనీల్లో స్టాక్స్ ఉన్నాయి. అందులో 900 ప్రిఫరెన్సియల్స్ స్టాక్స్. దాంతో ఆయనకు ఎప్పుడూ అన్ని రకాల ఫ్రీ కూపన్స్ వస్తూనే ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed