- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతనిలో ఆమె.. ఆమెలో అతడు!
దిశ, ఫీచర్స్ : సాధారణంగా పెళ్లైన తర్వాత అమ్మాయిలకు ఇల్లుతో పాటు ఇంటిపేరు కూడా మారుతుంది. కానీ కొంతమంది మహిళలు మాత్రం తమ ఇంటి పేర్లను, తమ పేరులో ముడిపడి ఉన్న తండ్రి పేరును వదులుకునేందుకు ఇష్టపడరు. అయితే 'ఇంటిపేరు' మార్చే సంప్రదాయం మన దగ్గరే కాదు, జపాన్‌లోనూ ఉంది. కాగా సమాజంలో వేళ్లూనుకున్న పురుషాధిక్యత, సనాతన సంప్రదాయాలు.. మహిళలను, బాలికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో? ఎంతగా వేదనకు గురి చేస్తాయో? టోక్యోకు చెందిన 35 ఏళ్ల బిజినెస్ మ్యాన్ షుహీ మాట్సువోకు తెలియదు. కానీ తన ప్రేయసి టీనా పోస్ట్, తన ఆలోచనా సరళిని మార్చేయడంతో, తామిద్దరూ కూడా పెళ్లైన తర్వాత కూడా వారి ఇంటిపేర్లను కోల్పోవటానికి ఇష్టపడలేదు. కాబట్టి వారు ఒకరి ఇంటి పేరును మరొకరు స్వీకరించారు. ఇందుకోసం షుహీ జపాన్ స్వాభావిక సెక్సిజాన్ని సవాలు చేయడంతో పాటు అక్కడి చట్టాలను ఎదిరించాడు.
2014లో హాంకాంగ్‌లో ఉద్యోగం చేసేందుకు వెళ్లిన షుహీ.. అక్కడే టీనా పోస్ట్‌ను కలిశాడు. ఆమె స్నేహంలో తన భావజాలం, పురుషాధిక్యత ఆలోచనలను, లింగ భావనల పట్ల తన దృక్పథాన్ని మార్చుకున్నాడు. 'జెండర్ బయాస్ అనేది రోజువారీ జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో, దానివల్ల స్త్రీలు ఎంతలా బాధపడుతున్నారో తెలుసుకున్నాను. ఈ క్రమంలో 2017లో మా వివాహానంతరం ఒకరి ఇంటిపేర్లను మరొకరు స్వీకరించాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు టీనా తన పేరును 'టీనా మాట్సువో పోస్ట్'గా మార్చుకుంది. ఇందుకు ఆమెకు ఎక్కువ కాలం పట్టలేదు. కానీ నేను నా పేరును షుహీ మాట్సువో నుండి జపాన్‌లోని షుహీ మాట్సువో పోస్ట్‌గా చట్టబద్ధంగా మార్చుకునేందుకు ఎనిమిది నెలలు పట్టింది. ప్రస్తుతం, జపనీస్ చట్టం ప్రకారం వివాహిత జంటలు.. తమ జీవిత భాగస్వాముల కుటుంబ పేర్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. అయితే జపనీస్ నేషనల్, ఫారిన్ నేషనల్ మధ్య వివాహాల విషయంలో మాత్రం ఈ చట్టం వర్తించదు. వివాహం చేసుకున్న జపనీస్ జంటలు, తమ చివరి పేర్లను హైఫనేట్ చేయడం లేదా కుటుంబ పేరును మధ్య పేరుగా ఉంచడం లేదా వారి చివరి పేర్లు రెండింటినీ కొత్త పేరుతో కలపడం వంటి ఎంపికలు చట్టబద్ధం కావు. ఇక్కడ మహిళలు తమ భర్త ఇంటిపేరునే తమ పేరులో చేర్చుకోవడానికి ఇష్టపడగా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 96 శాతం జపనీస్ మహిళలు తమ భర్త పేరును పెట్టుకుంటారు. మేం మాత్రం ఆ మూస ధోరణిని బ్రేక్ చేశాం. దాంతో పుట్టుకతో పెట్టిన పేర్లతో పాటు మా ఇద్దరి వివాహ బంధాన్ని కూడా ప్రతిబింబించేలా మా పేర్లు నిలిచిపోయాయి' అని షుహీ మాట్సువో పోస్ట్ తెలిపాడు.
కాగా షుహీ తన పేరును మార్చుకోవడం వల్ల ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా 'ఐ టుక్ హర్ నేమ్' అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఇది డిసెంబర్‌లో విడుదల కాగా, ప్రస్తుతం ఏడు నెలల పెటర్నిటీ సెలవులో ఉన్న షుహీ.. ఇప్పుడు మేల్ ఫెమినిస్ట్‌గా మారిపోయాడు. అంతేకాదు తన స్వీయ అనుభవాలు పంచుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నాడు. జపనీస్ సమాజంలో మహిళలపై వివక్ష చూపడాన్ని సహిస్తున్నారు, తమ రోజువారీ జీవితంలో భాగంగా అంగీకరిస్తున్నారు. కానీ ఈ వివక్షను అంతం చేయడానికి పురుషులు ఇంటిపనిలో భాగం కావాలి, తమ భాగస్వామికి నిత్యం తోడుగా నిలుస్తూనే, పిల్లల సంరక్షణంలో సాయపడాలి. అందుకు పితృత్వ సెలవులు తీసుకోవాలని షూ అభిప్రాయపడ్డారు.