- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్ష కేంద్రానికి బిలియనీర్ విహారయాత్ర!
దిశ, ఫీచర్స్: తీరికలేని పనులతో నిత్యం బిజీ బిజీగా గడిపే బిజినెస్ టైకూన్స్ కూడా పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కోరుకుంటారు. అందుకోసం ప్రకృతి రమణీయ ప్రదేశాలు, చారిత్రక ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ జపాన్‌కు చెందిన బిలియనీర్.. ఎంటర్‌ప్రెన్యూర్ యుసాకో మెజావా, అతని అసిస్టెంట్ యోజో హిరానోతో కలిసి ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్కొమోస్ వెల్లడించింది. 8 డిసెంబర్ 2021న ఖజకిస్థాన్‌లోని బైకొనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతరిక్షానికి బయలుదేరనున్న రష్యన్ ‘సోయజ్ MS-20’ స్పేస్ క్రాఫ్ట్‌లో ప్రయాణించనున్నారని సదరు ఏజెన్సీ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఆన్‌లైన్ రిటైల్ బిజినెస్‌లో బాగా సంపాదించిన యుసాకో మెజావా(45).. 2023 మూన్ మిషన్‌లో భాగంగా స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్‌లో చంద్రుడి పైకి వెళ్లనున్నాడు. ఇందు కోసం మెజావాతో పాటు ఫిల్మ్ ప్రొడ్యూసర్ హిరానో.. మాస్కో, స్టార్ సిటీలో గల ‘యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్’లో జరగనున్న ప్రీ ఫ్లైట్ ట్రైనింగ్‌లో పాల్గొంటారని రోస్కొమోస్ తెలిపింది. కాగా ఈ మిషన్ గురించి పలు విషయాలను మెజావా పంచుకున్నాడు. స్పేస్‌లో లైఫ్ ఎలా ఉండబోతుంది.. అనే విషయంలో ఆతృతగా ఉన్నానని, తిరిగొచ్చాక అక్కడి అనుభవాలను తన యూట్యూబ్ చానల్ ద్వారా వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నాని తెలిపాడు.
కాగా 2009లో ఒక కెనడియన్ టూరిస్టును ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లిన రోస్కొమోస్.. ఇప్పుడు మొదటిసారి ఇద్దరు టూరిస్టులను తీసుకెళ్లబోతోంది. గత సంవత్సరం స్పేస్‌ఎక్స్ పునర్వినియోగ రాకెట్.. నాసా వ్యోమగాములను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించిన తర్వాత ఐఎస్‌ఎస్‌కు సిబ్బందిని తీసుకెళ్లడంలో రోస్కొమోస్ స్పేస్ ఏజెన్సీ తన గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది. దీంతో స్పేస్ ఎక్స్ టూరిస్టు ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమవుతున్నాయి.