- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుమో యోధుడు ‘హకుహో’కు కొవిడ్
దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ జాతీయ క్రీడ సుమో కాగా.. తొలిసారి ఓ సుమో యోధుడికి కరోనా వైరస్ సోకినట్లు జపాన్ సుమో అసోసియేషన్ ప్రకటించింది. క్రమశిక్షణ, ఆహార నియమాలు, కఠిన నిబంధనలు పాటించే సుమోలు.. మహాయోధులుగా ప్రపంచ ప్రసిద్ధి పొందగా, ఆ మల్ల యోధులకు కూడా కరోనా రావడం జపాన్‌లో కలకలం రేపింది.
ఎన్నో పోటీల్లో ఘన విజయాలు సాధించిన ట్యాప్ ర్యాంక్ సుమో రెజ్లర్ ‘హకుహో’. తాజాగా ఆయనలో వాసన, రుచి జ్ఞానాన్ని కోల్పోవడం వంటి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పీసీఆర్(పాలిమరేస్ చైన్ రియాక్షన్) టెస్ట్ చేయగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగోలియాలో పుట్టిన హకుహో, ఈ వీకెండ్‌లో జరిగే గ్రాండ్ సుమో టోర్నమెంట్ కోసం ప్రిపేర్ అవుతుండగా, ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది. సుమో రెజ్లింగ్‌లో గ్రాండ్ చాంపియన్‌షిప్ ‘యోకోజునా’ను ఎక్కువ రోజులు నిలుపుకున్న సుమో యోధుడిగా హకుహోకు మంచి గుర్తింపు ఉంది. 1964 ఒలంపిక్స్‌లో అతడి తండ్రి రెజ్లింగ్‌లో పాల్గొని మంగోలియాకు సిల్వర్ మెడల్ అందించాడు.
125 మిలియన్ల పాపులేషన్ ఉన్న జపాన్‌లో ఇప్పటివరకు 2,49,000 కరోనా కేసులు నమోదు కాగా, 3500 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ దేశం కరోనా వైరస్‌ను సమర్ధంగా కట్టడి చేసిందనే చెప్పాలి. అయితే ఇటీవల కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, టోక్యోలో అత్యవసర పరిస్థితిని విధించాలని స్థానిక అధికారులు ప్రైమ్ మినిస్టర్ యోషిహిదేను కోరారు.