- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ..చీకట్లో వెలిగే మ్యాన్‌హోళ్లు
అసలే వర్షాకాలం..నీళ్లతో నిండిన రోడ్లు కనిపించడం సర్వసాధారణం. ఈ నీళ్లతో పెద్దగా సమస్య ఉండదు. కానీ, అసలు సమస్యల్లా మ్యాన్‌హోళ్లతో వస్తుంది. పగటిపూట వాటిని కనిపెట్టడం కొంచెం సులభమమే. కానీ, రాత్రిపూట వాటిని గుర్తించడం చాలా కష్టం. ఈ సమస్యకు జపాన్‌లోని టోకోరోజవా సిటీ ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ఆ సిటీలో మ్యాన్‌హోల్‌లు అన్నింటినీ చీకట్లో వెలిగే డిజైన్‌లతో హంగులు దిద్దింది. ప్రముఖ యానిమేషన్ సిరీస్‌లైన నియాన్ జెనెసిస్ ఎవాంజిలియాన్, గుండమ్‌లోని పాత్రలతో వీటిని అలంకరించారు. నవంబర్‌లో జరగనున్న జపనీస్ పాపులర్ కల్చర్ ఈవెంట్‌ను పబ్లిసిటీ చేయడంలో భాగంగా వారు ఇలాంటి వినూత్న పద్ధతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
వీటిని పెట్టడం వల్ల మ్యాన్‌హోల్‌ళ్లను గుర్తించడం సులభమే కాకుండా, రోడ్డుకు కొంత కళ వచ్చిందని స్థానికులు అంటున్నారు. ఈ వెలిగే మ్యాన్‌హోళ్లను చూసుకుంటూ వెళ్తుంటే, తాను ఇంటికి వెళ్లే దూరం తగ్గుతున్నట్లు అనిపిస్తోందని 22 ఏండ్ల కొటారో కొడైరా అన్నారు. ఇప్పటివరకు 27 డిజైన్‌లను పెట్టినట్లు సీవేజ్ శాఖ తెలిపింది. వీటిని సౌరశక్తి ఆధారిత ఎల్‌ఈడీ లైట్లతో డిజైన్ చేయడం వల్ల రోజంతా సూర్యరశ్మి స్వీకరించి రాత్రి పూట వెలుగును ఇస్తాయని టోకోరోజవా నగరపాలక సంస్థ తెలిపింది. ఇవి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు వెలుగుతుండటం వల్ల రోడ్డు మీద జరిగే నేరాలు కూడా తగ్గుముఖం పట్టే వీలుందని సిటీ ఆఫీసర్లు వెల్లడించారు.