- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కార్ మాస్క్’తో.. గాలిలోని వైరస్‌కు చెక్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ ‘కొత్త స్ట్రెయిన్’ మరోసారి పలు దేశాలను కలవరపెడుతుండగా.. ఇండియాలో కొన్నిరోజులుగా తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు, మళ్లీ స్వల్పంగా పెరుగుతుండటం గమనార్హం. వైరస్‌ను ఎదుర్కొనేందుకు టీకా అందుబాటులోకి వస్తున్నా, ఆ టీకా(కోవాగ్జిన్) మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీకా పనితీరుపై ప్రజల్లోనూ ఇప్పటికీ అనుమానాలే ఉన్నాయి. ఈ భయాందోళనలకు తోడు టీకా వేయించుకున్నా సరే.. మాస్క్ ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడంతో మరికొన్ని నెలల పాటు వాటిని పాటించక తప్పదు. ఈ క్రమంలోనే జపనీస్ కార్ మేకర్ హోండా ప్రత్యేకంగా ‘కార్ మాస్క్’ రూపొందించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే ‘మాస్క్’ మస్ట్. కానీ చాలామంది కారులో వెళ్లేటప్పుడు మాత్రం తాము లోపలే ఉన్నాం కదా! అని ‘మాస్క్’ పెట్టుకోవడం లేదు. అయితే గాలిలోనూ కరోనా వ్యాప్తి చెందుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు కారు లోపల కూడా వివిధ రకాల వైరస్‌లు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జపనీస్ కార్ల తయారీదారు హోండా.. ‘కురుమకు’(కార్ మాస్క్)ను రూపొందించింది. కారులోని ఎయిర్ ఫిల్టర్ పైన దీన్ని అమర్చుకునే అవకాశం ఉండగా, కార్ ఏసీ ఆన్ చేసిన 15 నిమిషాల్లో 99.8 శాతం వైరస్ డ్రాప్‌లెట్స్‌ను ఇది చంపేస్తుందని, ఆ తర్వాతి 24 గంటల్లో 99 శాతం వైరస్‌లను కిల్ చేస్తుందని మేకర్స్ తెలిపారు. జింక్ -ఫాస్పేట్ కెమికల్ కన్వర్షన్ సిస్టమ్ ద్వారా పనిచేసే ఈ పర్యావరణహితమైన మాస్క్.. ఓ సంవత్సర కాలం పాటు లేదా 9300 మైళ్ల వరకు పనిచేస్తుందని తెలిపారు. అయితే ఇది కేవలం గాలిలోని వైరస్‌లను మాత్రమే చంపగలదని, కార్ డోర్ హ్యాండిల్స్, ఇతర ఉపరితలాలపై ఉన్న వైరస్‌లపై ప్రభావం చూపదని వెల్లడించారు. కాగా ఇలాంటి మాస్క్.. ‘క్యాబ్స్’కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, అందులో వందలాది ప్రజలు ట్రావెల్స్ చేస్తుంటారని అన్నారు. దీని ధర రూ. 4500/-.