ఘాటు సోయగాల గులాబీ బాలా… కుర్రాళ్ళ మతులు ఇలా పోగొడితే ఎలా?

by Jakkula Samataha |   ( Updated:2021-03-16 00:58:27.0  )
ఘాటు సోయగాల గులాబీ బాలా… కుర్రాళ్ళ మతులు ఇలా పోగొడితే ఎలా?
X

దిశ,వెబ్ డెస్క్:బాలీవుడ్ ముద్దగుమ్మలకు బోల్డ్ ఫోటోషూట్ లు కొత్తేమి కాదు. అందులోను అందాల అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ కి అసలు కొత్తకాదు. ఎప్పటికప్పుడు తన అందాలను కుర్రకారుకు ఎరవేస్తూ వారి దిల్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది. ‘ధఢక్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ సినిమాలకంటే సోషల్ మీడియాలోని తన ఫోటోషూట్లతోనే బాగా ఫేమస్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ అమ్మడు తాజాగా ఇన్స్టాలో పెట్టిన ఫోటోలు నెటిజ‌న్స్‌కు నోటి నుండి మాట రానివ్వకుండా చేస్తున్నాయి.

కళ్ళు చెదిరే రెడ్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఓరకంటి తో చూస్తున్న జాన్వీ అచ్చం గులాబీనే తలపిస్తుందని చెప్పాలి. లేతలేత వయ్యారాలను టాప్ లెస్ కర్వ్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ చూపిస్తూ కుర్రాళ్లను హీటెక్కిస్తోంది. ఇక ఈ ఫొటోస్ కి అమ్మడు ఇంకా మత్తెక్కించే క్యాప్షన్ పెట్టింది. “వసంతకాలంలో చెర్రీలు” అంటూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మరి అమ్మడి ఘాటు అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.ఇకపోతే ప్రస్తుతం జాన్వీ ‘దోస్తాన 2’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలలో నటిస్తుంది.

Advertisement

Next Story