ఫోజులిచ్చిన జాన్వీ.. అందానికి దాసోహం అంటున్న ఫ్యాన్స్

by Shyam |   ( Updated:2021-11-06 08:43:21.0  )
ఫోజులిచ్చిన జాన్వీ.. అందానికి దాసోహం అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి జాన్వీ‌కపూర్ తన సోదరి ఖుషీ కపూర్ పుట్టిన‌రోజు పార్టీలో సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ మేరకు ఆమె అలంకరణకు సంబంధించి నయా‌ లుక్స్‌ను తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు హాట్ పింక్ డ్రెస్‌లో ఫోజులిచ్చిన జాన్వీ.. గులాబీ రంగు పెదాలు, ఎర్రబడిన బుగ్గలు,మాస్కరాతో అలంకరించిన కనురెప్పలు, ఆకు పచ్చరంగు అలంకరించబడిన ఉంగరం, వెండి చెవిపోగులు, నియాన్ బ్లూ నెయిల్ పెయింట్‌, పోనీటైల్‌తో జుట్టును కట్టుకోగా ముద్దుగ లడ్డుల, కనిపించింది.

అంతేకాదు తన అందాలను చూసి మురిసిపోతూ తనను తానే పొగుడుకుంటూ ‘బార్బీ బేబీ’ అని క్యాప్షన్ ఇవ్వడం విశేషం. కాగా జాన్వీ లుక్స్ చూసిన నెటిజన్లు ఒకరు ‘పింక్ బేబీ అదిరిపోయింది’ అంటే మరొకరు ‘పింక్ ముద్దబంతిలా గుడ్రంగా ఉన్నావ్ బేబీ, నీ అందాలకు నేను దాసోహం’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, దోస్తానా2, మిలి వంటి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మీరు హుక్కా తాగితే లేని కాలుష్యం.. మేము టపాసులు పేలిస్తే పెరిగిందా.. నటిపై నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story