అక్కడ పచ్చబొట్టు వేయించుకున్న జాన్వీ.. ఆ పేరు ఎవరిదో తెలుసా?

by Shyam |
Janhvi Kapoor
X

దిశ, సినిమా : బాలీవుడ్ దివా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ట్రిప్స్, డ్యాన్స్, వర్కౌట్ వీడియోస్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌కు అప్‌డేట్స్ అందించే భామ.. తాజాగా టాటూ వేయించుకునే వీడియో షేర్ చేసింది. టాటూ వేస్తున్నప్పుడు భయపడుతూనే గోవింద గోవింద అంటూ జపించిన భామ.. కంప్లీట్ అయ్యాక టాటూని షేర్ చేసింది. ‘ఐ లవ్ యూ లబ్బు’ అని ఉన్న ఈ టాటూని అభిమానులతో పంచుకోగా దీనిపై చర్చ మొదలుపెట్టేశారు. ‘ఇంతకీ లబ్బు ఎవరు? ఫ్రెండ్ లేక బాయ్ ఫ్రెండ్’ అని ఆరాతీయడం మొదలుపెట్టారు. ఫైనల్‌గా లబ్బు ఎవరో కాదు జాన్వీనే అని కన్‌ఫర్మ్ అయిపోయింది. తన తల్లి శ్రీదేవి అలాగే పిలిచేదని.. గతంలో శ్రీదేవి ‘ఐ లవ్ యు లబ్బు. ప్రపంచంలో నువ్వు బెస్ట్ బేబీ’ అని పోస్ట్ పెట్టగా.. శ్రీదేవి మూడో వర్ధంతిన ఈ పోస్ట్‌కు ‘మిస్ యూ’ అంటూ రిప్లయి ఇచ్చింది జాన్వీ.

Advertisement

Next Story