జనతా కర్ఫ్యూకు జనసేన మద్దతు

by srinivas |   ( Updated:2023-03-31 17:25:54.0  )
జనతా కర్ఫ్యూకు జనసేన మద్దతు
X

కరోనా వైరస్ మహమ్మారిపై యుద్ధం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సంక్షోభం యావత్తు మానవాళిని చుట్టుముట్టిందన్న ఆయన.. ఈ నెల 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశమంతటా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో ఎవరూ తమ ఇల్లు, సొసైటీ లేదా భవనం నుంచి బయటకు రావొద్దని చెప్పారు. మనల్ని మనం కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా సంయమనం పాటించాలన్నారు. రాబోయే కొద్ది రోజులపాటు చాలా ముఖ్యమైన పని ఉంటేనే ప్రజలు తమ ఇళ్ళ నుంచి బయటకు రావాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనాపై ప్రధాని మోదీ సూచనలను తెలుగు ప్రజలందరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న జనతా కర్ఫ్యూగా పాటిద్దామని పిలుపునిచ్చారు. కరోనా బాధితులకు సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారుkalyan

Advertisement

Next Story

Most Viewed