- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేపు గుంటూరులో జనసేన భారీ బహిరంగ సభ..

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా రేపల్లె నియోజక వర్గంలోని చెరుకుపల్లిలో ఆదివారం జనసేన పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జరిగే ఈ సభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రసంగించనున్నారు. ప్రజలను పాలక పక్షం వంచిస్తోందని వారికి జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని ప్రజల్లోకి జనసేన మెసేజ్ పంపనుంది.
ఆదివారం మధ్యాహ్నం నారా కోడూరు నుంచి మొదలయ్యే ర్యాలీ కట్టింపూడి, పొన్నూరు, నిడుబ్రోలు, చందోలు మీదుగా చెరుకుపల్లికి చేరుతుందని వివరించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సమన్వయకర్త కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ ఇతర నేతలు పరిశీలించారు.
Next Story