పుస్తకాల్లో చదివినట్టు సమాజం ఉండదు: పవన్

by Anukaran |   ( Updated:2020-12-05 10:49:19.0  )
పుస్తకాల్లో చదివినట్టు సమాజం ఉండదు: పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: మార్పు వచ్చే వరకు ప్రయాణం ఆగదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రశ్నించే తత్వం యువతలో పెరగాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన బాలాయపల్లి-గొల్లపల్లి మార్గమధ్యలో ఎదురైన యువకులతో కల్వర్టుపై కూర్చుని ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అవినీతిని ప్రశ్నించాలంటే ఓటును అమ్ముకోవద్దని హితవు పలికారు. ఇందుకోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుస్తకాల్లో ఉన్నట్టు ప్రస్తుత సమాజం లేదని ఎటు చూసిన అవినీతి నిండిపోయిందన్నారు. ఎంతో సేవ చేద్దామనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed