- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టెప్పేసిన తాజా, మాజీ సీఎంలు.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ దేశంలో పేరుమోసిన సీనియర్ రాజకీయ నాయకులు. ఇద్దరి వయసు 75 ఏళ్ల పైమాటే. నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా గడిపే వాళ్లిద్దరూ ఒక వివాహ వేడుకలో కలిసి స్టెప్పులేశారు. అందులో ఒకరు ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాగా మరొకరు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చైర్మన్ ఫరూక్ అబ్దుల్లా. వీరిరువురు కలిసి ఒక పెళ్లి వేడుకలో డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మనవరాలు పెళ్లి వేడుకలో ఆవిష్కృతమైంది ఈ అద్భుత దృశ్యం. ఇటీవలే అమరీందర్ సింగ్ మనవరాలి పెళ్లి ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఘనంగా నిర్వహించారు. దీనికి ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు.
From Punjab CM @capt_amarinder's grand daughter's marriage. Farooq Abdullah dancing to tunes of "Aajkal tere mere pyar ke charche"…. pic.twitter.com/laDGzDG0Sm
— Babar Rather (@BabarRatherKDC) March 4, 2021
పెళ్లి వేడుకలో భాగంగా ముందు ఫరూఖ్ అబ్దుల్లా.. దివంగత గాయకుడు మహ్మద్ రఫీ పాడిన ‘ఆజ్ కల్ తెరె మెరె ప్యార్ మే చర్చే’, ‘గులాబి ఆంకే జో తెరి దేఖి’ పాటలకు కాలు కదిపారు. 83 ఏళ్ల ఫరూఖ్ అబ్దుల్లా కుర్రాడిలా మారిపోయి ఈ పాటలకు స్టెప్పులేశారు. ఇక ఆయన డాన్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్న అమరీందర్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆయనను కూడా స్టేజీ మీదకు తీసుకొచ్చారు అబ్దుల్లా. ఇద్దరూ కలిసి రఫీ పాటలకు మైమరిచిపోయి డాన్స్ చేశారు.
ఇది కూడా చదవండి : బంగారు కత్తితో గడ్డం గీసుకోవాలనుందా..? అయితే అక్కడికి వెళ్లాల్సిందే..
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. వయసు మీద పడుతున్నా.. నిత్యం రాజకీయాలతో, పోరాటాలతో బిజీగా గడిపే అబ్దుల్లా, చీఫ్ మినస్టర్ అమరీందర్ సింగ్‌లు కుర్రాళ్లలా మారిపోయి డాన్స్ చేయడాన్ని నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. డాన్స్‌తో పాటు అంతకుముందు తన మనవరాలి కోసం అమరీందర్ సింగ్ పంజాబీ పాట కూడా పాడటం గమనార్హం.