- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకు షాక్.. సునీల్ యాదవ్ ఏమన్నాడంటే ?
దిశ, ఏపీ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కీలక అనుమానితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టులో వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించాల్సి ఉందని అందుకు అనుమతించాలని సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టును కోరింది. దీంతో నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్‌ను న్యాయమూర్తి అడిగారు.
అయితే నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దాంతో సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో కోర్టులో సీబీఐకి నిరాశ ఎదురైంది.