ఆస్కార్‌‌కు ‘జల్లికట్టు’

by Anukaran |   ( Updated:2020-11-25 08:45:27.0  )
ఆస్కార్‌‌కు ‘జల్లికట్టు’
X

దిశ, వెబ్‌డెస్క్: మళయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనూ అందుకుంది. తాజాగా ఈ చిత్రం 93వ అకాడ‌మీ అవార్డ్స్‌లో ఇండియా నుంచి చోటు ద‌క్కించుకున్న చిత్రంగా నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో అర్హత సాధించిన ఈ చిత్రాన్ని లిజో జోస్ పెల్లిస్సేరి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఇప్పుడు ఇంకో ఘనత సాధించింది. ఆస్కార్‌కు నామినేట్ అయింది.

ఓ అడవి దున్నను పట్టుకోవడానికి ఊరు ఊరంతా పరుగులు తీస్తే ఎలా ఉంటుంది? వినడానికే కాస్త విడ్డూరంగా ఉంది కదా? కానీ, ఇదే కథతో వచ్చిన సినిమా ‘జల్లికట్టు’. ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి మన జీన్స్‌లో ఇంకా నిద్రాణమై ఉందని, అది అవకాశం వచ్చినప్పుడు బయిటకు వస్తుందని ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. డిఫరెంట్ టేకింగ్‌తో తీసిన ఈ చిత్రం దర్శకుడి ప్రతిభను చాటుతుంది. ఆంటోనీ వ‌ర్గీస్‌, చెంబ‌న్ వినోద్ జోస్‌, స‌బుమోన్ అబ్దుస‌మ‌ద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఆస్కార్ బ‌రిలో హిందీ, మ‌ల‌యాళం, ఒరియా, మ‌రాఠి భాష‌ల నుంచి మొత్తం 27 సినిమాలు నిలిచాయి. అందులో శకుంతలా దేవి, గుంజన్ సక్సేనా, ఛపాక్, ఏకే వర్సెస్ ఏకే, గులాబో సితాబో, భోంస్లే, చెక్ పోస్టు, అట్కన్ చట్కన్, బుల్ బుల్, ది స్కై ఈజ్ పింక్ తదితర సినిమాలున్నాయి. వీటిలో జ‌ల్లిక‌ట్టును జ్యూరీ నామినేట్ చేసింద‌ని ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు చైర్మ‌న్ రాహుల్ ర‌వైల్ తెలిపారు. 2019 సెప్టెంబ‌ర్ 6న టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ‘జ‌ల్లిక‌ట్టు’‌ను ప్ర‌ద‌ర్శించగా అద్భుత‌మైన ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అంతేకాదు ఈ చిత్రానికి లిజో జోస్ ఉత్త‌మ డైరెక్ట‌ర్ ట్రోపీ కూడా అందుకున్నాడు. 2021 అకాడమీ అవార్డుల కార్యక్రమం సాధారణంగా ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈసారి కొవిడ్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed