హీరోను టార్చర్ పెట్టిన హీరోయిన్.. అందుకే!

by Shyam |
janni
X

దిశ, సినిమా: హాలీవుడ్ దివా జెన్నీఫర్ అనిస్టన్‌తో వర్క్ చేయడం టార్చర్ అనిపించిందని హీరో జేక్ గైలెన్హాల్ తెలిపాడు. 2002లో వచ్చిన ‘ది గుడ్ గర్ల్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటించగా.. తనతో సీన్స్ చేయడం టార్చర్ వంటిదని, అయితే ఇదంతా తన మీద ఉన్న క్రష్ వల్లే అని వివరించాడు. 30-50 మంది మధ్య లవ్ సీన్స్ చేయడం ప్రాబ్లమెటిక్‌గా, మెకానికల్‌గా అనిపించేదని అన్నాడు. అంతేకాదు దీన్ని డ్యాన్స్ అండ్ కొరియోగ్రఫీ‌తో కంపేర్ చేసిన జేక్.. ఫైనల్‌గా పిల్లో టెక్నిక్‌తో సక్సెస్‌ఫుల్‌గా సీన్స్ కంప్లీట్ చేశామని రివీల్ చేశాడు. ఇద్దరు నటుల మధ్య పిల్లోను పెట్టి సీన్ చేయడమే పిల్లో టెక్నిక్ కాగా, జెన్నీఫర్ ఇచ్చిన ఈ ఐడియానే తనను సేవ్ చేసిందని వెల్లడించిన జేక్.. ‘ది హోవర్డ్ స్టెర్న్ షో’లో ఈ విషయాలను పంచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed