- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆ కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వెబ్‌సిరీస్ కోసం సెలవు ప్రకటన
దిశ, ఫీచర్స్ : వరల్డ్ వైడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ‘మనీ హీస్ట్’ మ్యానియా మరోసారి మొదలైంది. ఇప్పటికే నాలుగు సీజన్లు రిలీజ్ కాగా.. అన్ని సీజన్లు సూపర్ సక్సెస్ సాధించాయి. సెప్టెంబర్ 3న సీజన్-5 విడుదలవుతుండగా ఈ షో మీద ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. మనీహీస్ట్ పాపులారిటీని క్యాష్ చేసుకునే క్రమంలో ఇండియన్ రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో జైపూర్‌కు చెందిన ఓ కంపెనీ ఆ షో విడుదల రోజు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం విశేషం.
ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో ‘మనీ హీస్ట్’కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుండగా జైపూర్‌కు చెందిన ‘వెర్వ్ లాజిక్’ అనే సంస్థ యాజమానులు కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆ షోపై అంచనాలను పెంచేయగా, వరల్డ్‌వైడ్‌గా సెప్టెంబర్ 3న ఇది స్ట్రీమింగ్ కానుంది. దీంతో వెర్వే లాజిక్ ‘నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ హాలిడే’ అంటూ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. తమ ఉద్యోగులు కొవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ, పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈవో అభిషేక్ జైన్ పేర్కొన్నాడు. ఇక మనీహీస్ట్ మ్యానియా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, ఈ సిరీస్ హిందీ వెర్షన్‌ను అనిల్ కపూర్, తెలుగు వెర్షన్‌ను రానా దగ్గుబాటి ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌లో రానా సౌత్ నెటివిటీని రిఫ్లెక్ట్ చేసే గెటప్‌లో కనిపించాడు.
‘ఒక్కోసారి వర్క్ నుంచి విరామం తీసుకోవడం మంచిది.
ఫాల్స్ లీవ్స్, మాస్ బంక్స్, ఫోన్ స్విచ్చాఫ్స్ వంటి సిల్లీ రీజన్స్ తమ ఎంప్లాయిస్ చెబుతారనే కారణంతో ఈ హాలీడే ఇవ్వడం లేదు. ‘మూమెంట్స్ ఆఫ్ చిల్ అనేది శక్తికి ఉత్తమ మాత్రలు అని మాకు తెలుసు. అందుకే మేము ఈ చొరవ తీసుకున్నాము. పాప్‌కార్న్ ఎంజాయ్ చేస్తూ, ప్రియమైన ప్రొఫెసర్ అండ్ టీమ్‌కు చివరి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోండి. ఇక కష్టసమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి పనిని స్మూత్‌గా చేయడంతో పాటు అద్భుతమైన స్ఫూర్తిని చూపించిన సభ్యులందరికీ వెర్వ్ లాజిక్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కష్ట సమయాల నుంచి అందరూ హ్యాపీగా బయటపడ్డాం. ఎప్పటినుంచో ప్రజలు నిజంగా ఒక ఆహ్లాదకరమైన సెలవుదినం కోసం ఎదురు చూస్తున్నారు.. ‘ఏక్ బ్రేక్ తో బన్‌తా హై’ అని మాకు తెలుసు. అంతేకాకుండా కొత్త షో గురించి ఉత్కంఠగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది వారికి చిల్ టైమ్’ – అభిషేక్ జైన్, సీఈవో వెర్వే లాజిక్