బోనీ ఇంట్లో హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా ?

by Jakkula Samataha |
బోనీ ఇంట్లో హెడ్ మాస్టర్ ఎవరో తెలుసా ?
X

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో బోనీ.. తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌‌లతో పాటు 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ముగ్గురు పనివాళ్లు కరోనా నుంచి కోలుకోవడం.. క్వారంటైన్ పీరియడ్ తర్వాత బోనీ, జాన్వీ, ఖుషీలకు నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.

కానీ ఆ టైమ్‌లో మాత్రం చాలా భయమేసిందని చెప్తోంది జాన్వీ కపూర్. లాక్‌డౌన్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో అనుకోని పరిస్థితి ఎదురుకావడంతో మొదట్లో చాలా కంగారు పడ్డట్టు తెలిపింది. ‘ఆ తర్వాత కాస్త కుదుటపడ్డానని.. నాన్నను ఆ సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నానని’ చెప్పింది. రోజుకు మూడు నాలుగు సార్లు ఆవిరి పట్టించి, రాత్రుళ్లు కూడా వేడినీళ్లు మాత్రమే తాగించేదట. ఇలా ‘నాన్నతో పాటు ఖుషీ ఆరోగ్యం గురించి పూర్తి బాధ్యత నేనే తీసుకోవడం.. ఇంట్లో ప్రతీ విషయాన్ని నేనే లీడ్ చేయడంతో నాన్న నన్ను ‘హెడ్ మాస్టర్’ అని పిలుస్తున్నాడంటూ సంతోషపడిపోయింది జాన్వీ.

Advertisement

Next Story

Most Viewed