ఎమ్మెల్యేకి కరోనా.. కవిత వర్గంలో టెన్షన్ 

by Anukaran |
ఎమ్మెల్యేకి కరోనా.. కవిత వర్గంలో టెన్షన్ 
X

దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు మంగళ వారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆయన వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ రావు తెలిపారు. గత ఐదు రోజులుగా తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించటంతో పాటు ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా కోరారు.

అయితే గత మూడు రోజులు గా ఆయన నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాదు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కవితను అభినందించడానికి సోమవారం ఆమెను కలిశారు సంజయ్. దీంతో కవిత వర్గంలో కలవరం మొదలైంది.

Advertisement

Next Story