- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
దిశ, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో.. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మృతి చెందిన వడ్లూరి రాములు కుటుంబాన్ని పరామర్శించి రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. రెండున్నర నెలల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. రైతుల మరణానికి మొదటి తప్పు కేంద్రానిదయితే, రెండవ తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు. సొంత నియోజకవర్గంలో రైతు మరణిస్తే మంత్రి హరీశ్ రావు కనీసం రైతు కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమైన విషయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుడు రాములు కు నలుగురు ఆడ పిల్లలున్నారని వాళ్ళ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు ధర్పల్లి చంద్రం సోమేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తప్పేట శంకర్, కాంగ్రెస్ అధ్యక్షుడు సత్తయ్య, జంగిటి శ్రీనివాస్, దాస అంజయ్య, అత్తు, గణేష్ చెలికాని యాదగిరి నాగరాజు బాగు శ్రీకాంత్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు..
నంగునూరు మండల కేంద్రంలో పలువురు యువకులు సోమవారం జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు యువకులకు కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.