- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, ఈటలపై జగ్గారెడ్డి ఫైర్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం తప్ప.. ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించడంలేదంటూ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులకు సరైన సదుపాయాలు లేవన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేవలం బులిటెన్లు విడుదల చేయడానికి మాత్రమే ఉన్నారన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరాలంటేనే భయమేస్తుందంటూ సోషల్ మీడియాలో బాధితులు పోస్టులు పెడుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం రూపాయి లేదని, ఉన్న నిధులన్నీ ప్రాజెక్టులకు మళ్లించారని ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రస్తుత సమయంలో ప్రజలకు కావాల్సింది కాళేశ్వరం, కొండపోచమ్మ ప్రాజెక్టులు కాదని.. కరోనా నుంచి రక్షించడం మాత్రమే అని ఆయన గుర్తు చేశారు. ప్రజలను కాపాడుతారా? లేక కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా అంటూ సీఎం కేసీఆర్ ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.