- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై కేసీఆర్ పోరాడాలి: జగ్గారెడ్డి
దిశ ప్రతినిధి, మెదక్: రెమిడెసివర్ ఇంజక్షన్లు తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా.. మనకు దొరకకపోవడం సిగ్గుచేటని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెమిడెసివర్ రాష్ట్రంలో ఎక్కడా దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలి పోతున్నారని చెప్పారు. రెమిడెసివర్‌ను రాష్ట్రానికి ప్రత్యేక కోటా కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అవసరమైన మేరకు మందులను, వ్యాక్సిన్లను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెట్టడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులను కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి తీసుకురాకుండా ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మెడికల్ షాపుల్లో రెమిడెసివర్ దొరికేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సరిపడా రెమిడెసివర్ ఇవ్వాలని కేంద్రం దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుతామని చెప్పారు. హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఫార్మా అనేది ఒక మాఫియా అని, పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ నడుస్తోందని ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తుంటే విజిలెన్స్ ఏం చేస్తోందని నిలదీశారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కామెడీ చేయొద్దని, మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. సీఎంకి భజన చేయకుండా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చోని రాష్ట్రానికి రావాల్సిన మందులపై శ్రీనివాస్ యాదవ్ పోరాడాలని చెప్పారు. శ్రీనివాస్ యాదవ్ ఓసారి సంగారెడ్డి హాస్పిటల్‌కు వచ్చి చూడాలన్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తగ్గినట్లు ప్రభుత్వం చూపిస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.