కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్‌కు మరోసారి షాకిచ్చిన జగ్గారెడ్డి..

by Shyam |   ( Updated:2021-12-26 22:24:24.0  )
కాంగ్రెస్‌లో కలకలం.. రేవంత్‌కు మరోసారి షాకిచ్చిన జగ్గారెడ్డి..
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి నుంచే మొదలు పెట్టనున్నారు. అయితే ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి విషయం చెప్పకుండానే రేవంత్ నిర్ణయం తీసుకున్నారట.

తనకే చెప్పకుండా డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడంతో జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ పెట్టబోయే రచ్చబండ కు హాజరు కాను అని తెగేసి చెప్పాడు. ఏవైనా కొత్త కార్యక్రమాలు చేపట్టేముందు అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి, ఇలా ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం, పార్టీకి నష్టం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమంలో నేను కనిపించకుంటే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ పోతుంది, ఈ హక్కు రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

పీసీసీ పోస్ట్ అంటే విడదీసే పోస్ట్ కాదని అందరినీ కలుపుకుపోయేది అని ఎద్దేవా చేశారు. పీఏసీ మీటింగ్ లో చర్చించకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ నిర్ణయాన్ని ఖండిస్తున్నానని, దీనిపై అధిష్టానానికి లేఖ రాస్తానని అన్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వరి సాగు.. సాక్ష్యాలతో సీఎంకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి

Advertisement

Next Story