- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారు
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీ వేరు, జాతీయ పార్టీని నడపడం వేరన్నారు. సీఎల్పీ భవన్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గడప దాటకుండా నాలుగు గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదని, ప్రధాని పదవిని ఆశించిన మాయావతి, శరద్ పవార్‌కే సాధ్యంకాలేదన్నారు. దళిత వ్యతిరేకి సీఎం కేసీఆర్‌కు మాయావతి మద్దతు ఇవ్వదన్నారు. కేసీఆర్ వెంట ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా కలిసిరావని, శివసేన సిద్ధాంతాలు వేరని, టీఆర్‌ఎస్ సిద్ధాంతాలు వేరన్నారు. దేశ ప్రజలు డెమొక్రటిక్ విధానానికి అలవాటు పడ్డారని, అధ్యక్ష తరహా విధానానికి ప్రజలు అంగీకరించరని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇక కరోనా పేరుతో అసెంబ్లీలో మీడియాపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ మీడియా గొంతు నొక్కుతుందని, మీడియాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఉద్యమంలో ఏనాడు అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల స్తూపమే మీడియా వేదిక అని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అమరవీరుల స్తూపం వేదికవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ 25 ఏళ్లుగా పోరాడుతున్నారని, అన్నిపార్టీలు వివిధ సంధర్భాలలో మద్దతు ఇచ్చాయని జగ్గారెడ్డి వివరించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆలస్యమవుతందని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని, కానీ ఇక్కడ ఎందుకు అవలంభిస్తలేరన్నారు.