ఈ నెల 8న 'జగనన్న విద్యాకానుక' ప్రారంభం

by srinivas |
ఈ నెల 8న జగనన్న విద్యాకానుక ప్రారంభం
X

దిశ, వెబ్‎డెస్క్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఈ నెల 8వ తేదీన సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందని, సుమారు రూ.650 కోట్ల విలువైన కిట్లను విద్యార్థులకు ఇవ్వనుంది.

జగనన్న విద్యాకానుక పథకం ఈ నెల 5వ తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా, కొవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. నవంబర్ 2న స్కూల్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర మార్గదర్శాలకు అనుగుణంగా కొవిడ్ నియమాలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story