ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

by srinivas |
online ticketing policy
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల పంపిణీ బాధ్యతను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ ప్రకారం.. ఆన్‌లైన్‌ టికెట్‌పై జీవో 142ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఐఆర్‌సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అయితే ఇప్పటి వరకూ పేటీఎం, బుక్‌ మైషో వంటి యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే టికెట్ ధరల వ్యవహారం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టికెట్ల ధరల బాధ్యతను హైకోర్టు డివిజన్ బెంచ్ జేసీలకు అప్పగించింది. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఓ కమిటీ వేయాలని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టికెట్ల ధరల విషయంలో ఏర్పడిన గందరగోళానికి ముగింపు పలకకుండానే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ఏపీ ఫిలిండెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed