- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారికి అన్యాయం జరగొద్దు: జగన్
దిశ ఏపీ బ్యూరో: అర్హులెవరికీ అన్యాయం జరగొద్దని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. సంక్షేమ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోతే పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పామని, వెంటనే ఆ దరఖాస్తులను పరిష్కరించి, అర్హత ఉన్నవారికి పథకాల ఫలాలు అందేలా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం జూన్ 4వ తేదీన ‘వైయస్సార్ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైయస్సార్ నేతన్న నేస్తం’, 24న ‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాలను గడువు కంటే ముందే ప్రారంభించామని చెప్పారు. అర్హులెవరైనా మిగిలిపోతే ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయా పథకాలకు అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి నగదు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.
‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ 24 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆయన అన్నారు. గత డిసెంబరు తర్వాత మగ్గం పెట్టుకున్న వారిని కూడా ఈ పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.