- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన వైసీపీ అభ్యర్థి సుధ
by Anukaran |
X
దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. దాసరి సుధ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె సరికొత్త రికార్డులు సృష్టించారు. 2019 ఎన్నికల్లో తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మెజారిటీని క్రాస్ చేశారు. అంతేకాదు మరో అరుదైన రికార్డును సైతం ఆమె సొంతం చేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెజారిటీని సైతం ఆమె క్రాస్ చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో 90వేల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యే గా జగన్ చరిత్ర సృష్టించారు. అయితే ఆ రికార్డును డా. దాసరి సుధ క్రాస్ చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో ఆమె 90,211 ఓట్లు మెజారిటీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.
Advertisement
Next Story