కడపలో జగన్ పర్యటన ఖరారు

by srinivas |
కడపలో జగన్ పర్యటన ఖరారు
X

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారైంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో జగన్‌ కడపలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులతో కలెక్టర్‌ సి. హరికిరణ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ కార్యక్రమాల్లో పాల్గోనున్నారని కలెక్టర్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే సీఎం కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed