- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కరోనా హాస్పిటల్స్ డబుల్
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. డిశ్చార్జ్‌లు, పెరుగుతున్న కేసుల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత పది రోజులుగా ఏపీలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ప్రధానంగా తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పాజిటివ్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నాలుగు జిల్లాల్లోనే పాజిటివ్ కేసులు 22 వేల పైచిలుకు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని, దానికి కారణాలు ఏంటని ఆయన ఆరాతీశారు. కరోనా ఆస్పత్రుల్లో క్రమక్రమంగా రద్దీ పెరుగుతుందని, ఇది మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. దీంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కోవిడ్-19 చికిత్స ఆస్పత్రులను 5 నుంచి పదికి పెంచుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 84 కరోనా చికిత్సాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని ఆయన సూచించారు. దీంతో వైద్యులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు బాధితులకు నాణ్యమైన సేవలు అందుతాయని ఆయన ఆకాంక్షించారు.
దీంతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకి వివరించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. కరోనాను ఇంకా కొంత మంది తేలిగ్గా తీసుకోవడం వల్లే సమస్య తీవ్రమవుతోందని పేర్కొన్నారు. అన్న రకాలుగా కరోనా తీవ్రతపై ప్రచారం చేస్తున్నామని సీఎంకి విశదీకరించారు. టెస్టులతో పాటు వైద్య సాయానికి స్వచ్చందంగా ముందుకు వచ్చేలా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 85 శాతం మంది ప్రజలకు కరోనా ఇళ్లలోనే నయమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.