జగన్ సర్కార్ కొత్త ఆర్డినెన్స్.. ఇకపై ఇద్దరు డిప్యూటీ మేయర్లు..?

by srinivas |
cm ys jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు క్లీన్ స్వీప్ చేసింది. అయితే మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈనెల 18న మేయర్, మున్సిపల్ చైర్మన్ ల ఎంపిక ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ చర్చలు చేపట్టారు. సోమవారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో జగన్ చర్చిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో సీఎం జగన్ సరికొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులను నియమించి సంచలనానికి శ్రీకారం చుట్టారు. తాజాగా మరో సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed