దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం: జగన్

by srinivas |
దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం: జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ మాధ్యమంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాక్షలు చెప్పారు. ట్విట్టర్‌లో ఆయన ఏమన్నారంటే… ‘ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story