- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యవసాయరంగానికి, రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారు’
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మూతపడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. టీడీపీ హాయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధిరేటు నమోదైతే.. ఈ ప్రభుత్వంలో దారుణంగా పడిపోయిందని విమర్శించారు. మంగళగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ రెండున్నరేళ్లలో జగన్ సర్కారు రైతులకు ఏంచేసిందని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులంతా ఏకమై రైతుల నోట్లో మట్టికొడుతున్నారన్నారు. రైతు లేకపోతే దేశమే లేదనే వాస్తవాన్ని పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు.
వ్యవసాయమంటే తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ అనే పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్ యాదవ్‌కు నీటిపారుదలశాఖ అప్పగించి శాఖలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9 వేలిస్తే, జగన్ రైతుభరోసా కింద దాన్ని రూ.7,500 లకు పరిమితం చేశాడని ఆరోపించారు. కేంద్రం బిందు తుంపరసేద్యానికి 60శాతం సబ్సిడీ ఇస్తుంటే, జగన్ 40శాతం ఇవ్వలేక ఆ పథకాన్ని రాష్ట్రంలో నిలిపేశాడని ఆరోపించారు. కర్నూల్‌లో చంద్రబాబు తీసుకొచ్చిన మెగాసీడ్ పార్క్‌ను మూతపడేలా చేశారని ధ్వజమెత్తారు. 2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200కోట్లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు పెంచామని గుర్తు చేశారు.
2019-20లో బడ్జెట్‌లో రూ.20వేలకోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం.. కేవలం రూ.7వేలకోట్లు మాత్రమే ఖర్చుపెట్టిందని మండిపడ్డారు. ఆ మొత్తంలో సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే సరిపోయిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700కోట్లు ఖర్చుపెడితే.. జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో 20వేల ట్రాక్టర్లను రైతురథం పథకం కింద రైతులకు పంపిణీ చేస్తే.. ఈ ప్రభుత్వం రైతులకు ఒక్క నాగలి కూడా ఇచ్చింది లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.