దీపాలు వెలిగించే వేళ జాగ్రత్త..

by Shyam |
దీపాలు వెలిగించే వేళ జాగ్రత్త..
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు జాతిని ఐక్యంగా ఉంచడంలో భాగంగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో అందరూ దీపాలు వెలిగించాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శానిటైజర్ ఉన్న చేతులతో దీపాలు వెలిగిస్తే చేతులు కాలుతాయని, దీపాలు వెలిగించే ముందు చేతులు కడుక్కోవాలని మంత్రి సూచించారు. రాత్రి తొమ్మిది గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల తెలంగాణ పవర్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఆయన స్పష్టం చేశారు. గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియాలో గ్రిడ్ ఫెయిలవుతుందని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.

Tags: light up candles, lights off, telangana, power minister, grid failure

Advertisement

Next Story