విద్యుత్ బిల్లును వ్యతిరేకించిన ఆ శాఖ మంత్రి

by Shyam |
విద్యుత్ బిల్లును వ్యతిరేకించిన ఆ శాఖ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యవసర సేవలను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. డిస్కంలకు ఇచ్చే రుణాల మీద ఒక శాతం తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రం తీసుకొస్తున్న బిల్లు ద్వారా వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. సబ్సిడీ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేవారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొనే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed