30 లక్షలు చాలనుకున్నాడు : జాఫర్

by vinod kumar |
30 లక్షలు చాలనుకున్నాడు : జాఫర్
X

‘మిస్టర్ కూల్’ అని పేరు తెచ్చుకున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇప్పుడు ఫ్యాన్స్‌తో సహా చాలా మంది గుర్రుగా ఉన్నారు. కరోనాకు సాయంగా రూ. 1 లక్ష మాత్రమే విరాళంగా ఇచ్చాడనే వార్త మీడియాలో రావడంతో ధోనీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి కరోనాతో సంబంధంలేని ఒక ఎన్‌జీవో రూ. 12 లక్షల విరాళాల సేకరణకు పూనుకోవడం, దానికి విరాళంగా ధోనీ ఒక లక్ష రూపాయలు ఇవ్వడంతో.. అది కరోనా కోసం విరాళమే అనుకొని విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడే ధోనీ ఆస్తుల గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, ధోనీ ప్రస్తుత ఆస్తుల విలువ రూ. 800 కోట్లు.

2004లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ధోనీ.. భారత జట్టులో వసీం జాఫర్‌తో సన్నిహితంగా ఉండేవాడు. అప్పట్లో తన రైల్వే ఉద్యోగం, తన క్రికెట్ జీవితం మొదలైన తీరు.. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నాడో తదితర విషయాలు పంచుకునే వాడంట. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన జాఫర్.. ప్రస్తుతం ఈ విషయాలనే గుర్తు చేసుకున్నాడు. ధోనీ ఇప్పుడంటే రూ. 800 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉన్నాడు. కానీ క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో ఒక 30 లక్షలు సంపాదించేసి.. తన సొంత ఊరైన రాంచీ వెళ్లి అక్కడే ఒక ఇల్లు కట్టుకొని హాయిగా బతికేస్తానని జాఫర్‌కు చెప్పేవాడట. ట్విట్టర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జాఫర్ పై విషయాలు వెల్లడించాడు.

Tags : MS Dhoni, Wasim Jafer, Team India, 30 Laks, Donation

Advertisement

Next Story

Most Viewed