- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత మంది బుర్రలేని వారున్నారా? : అనసూయ
దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. ఎక్కడలేని గొడవలు పుట్టుకొస్తాయి. అలా ఎందుకు పెట్టావని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే… దానికి అనసూయ చిర్రెత్తి పోవడం .. వాగ్వాదానికి దిగడం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా అలాంటి వార్ ఒకటి నడిచింది నెట్టింట్లో. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో మార్చి 31వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. అయితే అలా చేస్తే కష్టమవుతుందంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేసింది అనసూయ. ప్రభుత్వం చెప్పింది పాటిస్తాం కానీ.. కొంచెం సడలింపు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. మాలాంటి వాళ్లు వర్క్ చేయకపోతే నెలనెల అద్దె, కరెంట్ బిల్లు, ఈఎంఐలు చెల్లించలేమని.. కాస్త ఆలోచించాలని కోరింది.
ఈ ట్వీట్‌తో మండిపడ్డారు నెటిజన్లు. బ్యాంక్‌లో దాచిపెట్టిన డబ్బును తీయి.. బాగానే కూడబెట్టావ్ కదా అని హితవు పలుకుతున్నారు. మీలాంటి సెలబ్రిటీలు కూడా పరిస్థితిని అర్ధం చేసుకోకుండా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఎలా?.. నీ కన్నా కూలీ పని చేసే వాళ్లు నయం… మనందరికోసమే కదా ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతామని చెప్తున్నరని కామెంట్స్ చేశారు. ఒక్క వారం పనిలేకపోతే నెల రోజుల డబ్బులు ఎలా ఆగిపోతాయన్న ఓ నెటిజన్ ప్రశ్నకు స్పందించిన ఆమె… ఈ 10 రోజుల్లో 45 రోజుల షూట్ చేయాల్సి ఉంది. కానీ లాక్ డౌన్‌తో షూట్ క్యాన్సల్ అవడం వల్ల ఫినాన్షియల్‌గా చాలా బాధపడాల్సి వస్తదని చెప్పుకొచ్చింది. అయినా కూడా నెటిజన్ల నుంచి విమర్శలు తగ్గకపోవడంతో… అయ్య బాబోయ్ ఇంత మంది బుర్రలేని వాళ్లున్నారా..? ఇంత మంది వితండ వాదులున్నారా? అని ఆశ్చర్యపోయింది. నేను మన గురించి మాట్లాడితే… కేవలం నా గురించి మాత్రమే అనుకుని.. ఇంత రచ్చ చేస్తున్నారేంటి అసలు. అయినా సెన్స్ ఉంటే అర్ధం చేసుకునే వారులే అంది అనసూయ. ఇలాంటి వాళ్లను నా సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి బ్లాక్ చేసి చేసి వేళ్లు నొప్పేస్తున్నాయంది. కానీ తప్పదుగా.. నా పేజ్‌లో వాళ్ల బుర్రలేని తనం ఏంటి? నా మనశ్శాంతి.. నా బాధ్యత. అందుకే నన్ను అర్ధం చేసుకోలేని వారిని .. నేనే అర్ధం చేసుకుని ఇలా బ్లాక్ చేసి… వాళ్లైనా శాంతిగా ఉండేలా చేస్తున్నానని తెలిపింది జబర్దస్త్ భామ.