ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 'జబర్దస్త్' కమెడియన్..

by Sumithra |   ( Updated:2021-05-25 04:35:53.0  )
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్..
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర పాపులర్ ప్రోగ్రాం జబర్దస్త్ నటులు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పలువురు జబర్దస్త్ నటులు వ్యభిచార కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో జబర్దస్త్ నటుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ కామెడీ షోలో లేడి గెటప్ లో అందరిని అలరిస్తున్న హరి(హరిత)కి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.

స్మగ్లర్ల వద్ద నుండి రెండు నాటు తుపాకులను, రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్మగ్లింగ్ కేసులో హరి కూడా ఉన్నాడని, అతనికి కూడా దీంతో సంబంధం ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అంతకుముందు కూడా హరిపై స్మగ్లింగ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ కేసులతో తనకెటువంటి సంబంధం లేదని హరి తెలుపుతున్నాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ స్మగ్లింగ్ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతను తనపై పగ పెంచుకొని తనను కావాలనే ఇలాంటి కేసులో ఇరికిస్తున్నాడని హరి తెలుపుతున్నాడు.

Advertisement

Next Story