కామెడీ డైరెక్టర్ యాక్షన్ డ్రామా.. వర్కవుట్ అవుద్దా?

by Jakkula Samataha |
కామెడీ డైరెక్టర్ యాక్షన్ డ్రామా.. వర్కవుట్ అవుద్దా?
X

దిశ, సినిమా : మహాశివరాత్రి కానుకగా విడుదలైన ‘జాతి రత్నాలు’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. జోగిపేట యువకులుగా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటు చిట్టి క్యారెక్టర్‌లో ఫరియా పర్‌ఫార్మెన్స్ అండ్ డైలాగ్స్‌కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ క్రమంలో కేవలం ఎంటర్‌‌టైన్మెంట్‌తోనే సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన డైరెక్టర్ అనుదీప్‌ తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

ఈ నేపథ్యంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ‘ఉప్పెన’ హీరో వైష్ణవ్ తేజ్‌తో అనుదీప్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని ఈ కుర్ర డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. ‘జాతిరత్నాలు’ తర్వాత తాను ఒక యాక్షన్ సినిమా చేయాలనుకున్నానని, అదే చేస్తానని చెప్పారు. తనను నమ్మి తొలి సినిమా ఆఫర్‌ ఇచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్‌లోనే నెక్స్ట్ మూవీ ఉంటుందని ప్రకటించారు. తదుపరి సినిమాకు ఇంకా స్ట్రిప్ట్ వర్క్ పూర్తి చేయలేదని, కొన్ని కథలున్నాయని వాటిలో ఒకటి ఎంపిక చేసుకుంటానని తెలిపారు.

Advertisement

Next Story