- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జ్యోతి ప్రేమ అజరామరం: ఇవాంకా ట్రంప్
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన మోహన్ పాశ్వాన్‌ది నిరుపేద కుటుంబం. ఆయన తన కుటుంబాన్ని పోషించడానికి బీహార్ నుంచి గుర్గావ్ వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో మోహన్ యాక్సిడెంట్ గురయ్యాడు. ఆయన కూతురు జ్యోతి కుమారి తండ్రిని చూడటానికి బీహార్ నుంచి గుర్గావ్ వచ్చింది. ఈనేపథ్యంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వారికి పూట గడవడం కష్టమైంది. ఎట్లాగైనా సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు తండ్రీకూతురు. నడుచుకుంటూ వెళ్దామంటే తండ్రి గాయపడ్డాడు. దీంతో జ్యోతికుమారి తన దగ్గర ఉన్ననగదుతో సైకిల్ కొనుగోలు చేసింది. సొంతూరు చేరేందుకు తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు బీహార్‌కు చేరింది. జ్యోతికుమారి సాహసం, తండ్రిపై ఉన్న ప్రేమ అజరామరం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆమె చూపిన తెగువను భారత ప్రజలు, సైక్లింగ్ ఫేడరేషన్ గుర్తించిందని ట్వీట్ చేశారు. వలస కూలీల దుర్భర స్థితిని, జ్యోతి కుమారి తెగువను, మనో నిబ్బరాన్ని వెల్లడించిన ఈ ఘటనపై విస్తృత చర్చ జరిగింది. ఇండియన్ సైక్లింగ్ ఫెడరేషన్ కూడా జ్యోతి కుమారిని గుర్తించి వచ్చే నెల నుంచి ట్రయల్స్‌కు రావాలని ఆహ్వానించింది. తాజాగా, జ్యోతి కుమారిపై ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించారు.