డాన్ ‘చోటా రాజన్‌’ ఎయిమ్స్‌లో.. సామాన్యులు శ్మశానంలోనా..?

by Shamantha N |   ( Updated:2021-05-01 04:06:22.0  )
డాన్ ‘చోటా రాజన్‌’ ఎయిమ్స్‌లో.. సామాన్యులు శ్మశానంలోనా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో దేశంలో అనేక రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో బెడ్స్, వెంటలేటర్ల కొరత ఏర్పడింది. కరోనా బారినపడిన సామాన్యులు బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యం అందక ప్రాణాలు విడిచారు. కానీ, ఢిల్లీ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజేంద్ర నికల్జే(అలియాస్ చోట రాజన్‌)కు కరోనా సోకిన అనంతరం అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో దాడులు, పలు హత్యలతో సంబంధం ఉండి, దాదాపు 70 క్రిమినల్ కేసుల్లో నిందితుడి ఉండి, 2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ దే హత్య కేసులో దోషిగా తేలి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ క్రిమినల్‌ను.. నిమిషాల్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంటే దేశంలో హత్యలు చేసి.. జైలులో ఉన్నవారికి మాత్రమే సేవలు అందుతాయా.? సామాన్యులు మాత్రం వైద్య సాయం అందక చనిపోవాల్సిందేనా అని విమర్శిస్తున్నారు. వైద్య సేవలు అందాలంటే సామాన్యులు నేరస్థులుగా మారాలా..? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/Lavanya31805532/status/1386489239034945537?s=20

Advertisement

Next Story

Most Viewed