100 శాతం పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం : ఐటీసీ!

by Harish |
100 శాతం పునరుత్పాదక విద్యుత్ లక్ష్యం : ఐటీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వ్యాపార సంస్థ ఐటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి 100 శాతం విద్యుత్ అవసరాలను పునరుత్పాదక వనరుల నుంచి సమీకరించాలని లక్ష్యంగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం సుమారు 40 శాతం వరకు విద్యుత్ వినియోగంలో పవన, సౌర, జీవపదార్థాలు వంటి పునరుత్పాదక వనరుల నుంచి సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తోడ్పాటు అందించేందుకు పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో పటిష్ఠతకు మరిన్ని పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్టు ఐటీసీ పేర్కొంది. వీటితో పాటు 2030 నాటికి నిర్దిష్ట ఉద్గారంలో 50 శాతం తగ్గింపును, 30 శాతం నిర్దిష్ట ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపింది. ‘రెండు దశాబ్దాల క్రితం కంపెనీ వ్యాపార కార్యకలాపాల్లో పునరుత్పాదకతే లక్ష్యంగా ఉన్నట్టు, తక్కువ కర్బన వినియోగం కోసం ప్రణాళిక రూపొందించాం. ఇకమీదట పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోళియోను విస్తరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని’ ఐటీసీ గ్రూప్ ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్ హెడ్ సంజీవ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed