హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రచారంపై ఈటల సంచలన వ్యాఖ్యలు

by Sridhar Babu |   ( Updated:2021-08-16 04:34:11.0  )
హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రచారంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కరీంనగర్ సిటీ, జమ్మికుంట : ముఖ్యమంత్రి పర్యటనకు వేలాదిమందిని అరెస్టులు చేస్తుండగా, హుజురాబాద్ ప్రాంతం భయం గుప్పిట్లో ఉందని, మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. పేదల అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన సొమ్ముతో తాను సోకుల పడుతూ, టీఆర్ఎస్ ప్రచారానికి వాడుతున్నాడని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. దళితబంధు కార్యక్రమాన్ని స్వాగతీస్తున్నామని, నోటిఫికేషన్‌కు ముందే హుజురాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతుల్లేకుండా రూ.10 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాసాలమర్రిలో ఇప్పటికే ప్రారంభించిన దళితబంధు‌కు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకని ప్రశ్నించారు. సీఎం సభకు ఇక్కడి ప్రజలు స్పందించకపోవడంతో, ప్రజలు వస్తారో రారో అనే భయంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నీ జిల్లాలకు బస్సులు పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తలను మీటింగ్‌కు తరలిస్తున్నారని, అది ప్రజల మీటింగ్ కాదు.. టీఆర్ఎస్ మీటింగని ఎద్దేవా చేశారు. ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా, హుజూరాబాద్ ప్రజలు కెసీఆర్‌నీ నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు.

మీటింగ్ జరుగుతున్న ఊరికి కూడా బస్సులు పెట్టి జనాన్ని తీసుకుపోయే దుస్థితికి అధికార పార్టీ దిగజారిందని, జనాలను తరలించే బాధ్యతలను ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, వీఆర్ ఓ, వీఆర్ఏ‌లకు అప్పగించడం హేయనీయమన్నారు. ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో 10 వేల మంది పోలీసులను బందోబస్తు పెట్టారని, వీరితోనే సభాప్రాంగణం నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను నిర్బంధించి, ఇక్కడ మీటింగ్ పెట్టడం సీఎం కెసీఆర్ లో ఉన్న భయాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. చట్ట వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నాడని సీఎం పై మండిపడ్డారు. దళితులతో పాటు ఇతర కులాలలో కూడా పేదరికం అనుభవిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా అందించాలని, ఎరుకల, వడ్డెర, సంచార జాతులు, కుమ్మరలు, విశ్వకర్మలు, పద్మ శాలీలు, నాయీ బ్రాహ్మణులు, రజకు, గౌడ, ముదిరాజ్, కాపుతో పాటు తెలంగాణ‌లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇది అందించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed