బీసీసీఐకి జోహ్రీ చెడ్డ పేరు తెచ్చాడు: డయానా ఎడుల్జీ

by Shyam |
బీసీసీఐకి జోహ్రీ చెడ్డ పేరు తెచ్చాడు: డయానా ఎడుల్జీ
X

దిశ, స్పోర్ట్స్: మాజీ సీఈఓ రాహుల్ జోహ్రీ ప్రవర్తన కారణంగా బీసీసీఐకి చెడ్డ పేరు వచ్చిందని మాజీ క్రికెటర్, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. 2018లో రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా అతడిని సీఈఓగా కొనసాగించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అతడి మీద వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర కమిటీ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందని, దానిపై తనకు నమ్మకం లేదని చెప్పారు. అంతేకాకుండా జోహ్రీ వల్ల వేధింపులకు గురైన మహిళకు కనీసం క్షమాపణలు కూడా తెలుపకపోవడం ఏమిటో అర్థం కాలేదని తెలిపారు. తన పదవీకాలం ముగియడానికి ముందే బీసీసీఐకి జోహ్రీ రాజీనామా చేశారు. కానీ, అప్పుడు అతణ్ని కొనసాగించి, ఆకస్మాత్తుగా ఇతర ఆరోపణలపై ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బోర్డు సభ్యులు తెలుపాలని ఆమె డిమాండ్ చేశారు. రాహుల్ వల్ల బీసీసీఐకి ఎంతో కళంకం వచ్చినా ఎలాంటి విచారణ చేపట్టకుండా తొలగించడంపై ఎడుల్జీ అనుమానాలు వ్యక్తం చేశారు.

Advertisement

Next Story