తాప్సీ ఇంట్లో రైడ్స్.. సినీ ఇండస్ట్రీలో టెన్షన్ టెన్షన్

by Shamantha N |   ( Updated:2021-03-03 03:00:12.0  )
tapsee pannu
X

దిశ,వెబ్‌డెస్క్: ముంబైలో పలువురు సినీ నటుల ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ ఇండ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన వికాశ్ భల్ ఇంటి వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖు ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 22 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

నిర్మాణ సంస్థ ఫాంటోమ్ ఫిల్మ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫాంటోమ్ ఫిల్మ్స్ సంస్థతో సంబంధం ఉన్న డైరెక్టర్లు, నటుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఏక కాలంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతుండటంతో సినీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story