- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలకు డేంజర్ బెల్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కరోనా ప్రభావంతో దేశీయంగా ఉన్న ఐటీ సంస్థలు తీవ్రమైన ప్రభావానీ ఎదుర్కొంటున్నాయి. బీపీవో, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఐటీ కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగాలు ఇరకాటంలో పడ్డాయి. పెద్ద కంపెనీలు నష్టాన్ని భరిస్తూ కొనసాగించే అవకాశాలున్నప్పటికీ చిన్న చిన్న కంపెనీలు ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. కరోనా దెబ్బతో ఇప్పటికే నెలరోజులుగా తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రానున్న ఆరు నెలల కాలంలో ఐటీ కంపెనీల్లోనే సుమారు లక్షన్నర వరకూ ఉద్యోగాలు పోయే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఐటీ కంపెనీలపైనే ఉంటుందని ఎక్కువ ఉద్యోగాలు వీటిలోనే తొలిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఐటీ పరిశ్రంలో సుమారు 45 లక్షల వరకూ ఉద్యోగులున్నారు. ఇందులో చిన్న కంపెనీల్లో మాత్రమే 12 లక్షల మంది వరకూ పనిచేస్తున్నారు. మిగిలిన వారు దేశంలో ఐదు అతిపెద్ద సంస్థల్లో పని చేస్తున్నారు.
గత రెండు నెలలుగా కరోనా వ్యాప్తితో కీలకమైన సంస్థలన్నీ నిలిచిపోయాయి. తయారీ రంగంలోని మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు రానున్న త్రైమాసికంలో నష్టాలను ఎదుర్కోవడం తప్పదనే అభిప్రాయంలో ఉన్నాయి. అనేక దేశాల్లో లాక్‌డౌన్ మరిన్ని రోజులు కొనసాగితే ఈ నష్టం ఎంతనేది ఊహించలేమని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ పరిణామాలు ఐటీ పరిశ్రమ రంగానికి తీవ్ర ఒత్తిడిని తెచ్చే స్థితిలోకి నెట్టేస్తాయి. గడిచిన పాతిక సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమకు ఈ స్థాయి అనిశ్చితి ఏర్పడటం ఆందోళన కలిగించే విషయం.
ఉద్యోగాలతో పాటు ఐటీ ఎగుమతులపైనా కరోనా ప్రభావం తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ని కొనసాగించే పరిస్థితి ఉన్నందున కొన్ని దేశాలు తమ క్లయింట్ల జీతాల్లో కోత విధిస్తున్నాయి. దీనివల్ల ఇండియాలోని దిగ్గజ సంస్థలన్నీ ప్రతికూలతల నుంచి తప్పించుకోలేవు. మరో ఆరు నెలల కాలంలో ఐటీ పరిశ్రమకు సుమారు 7 శాతం వరకూ తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
tags: corona virus, it jobs, effect of corona, it jobs at risk